23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డి లో ట్రిబుల్ ఇంజన్ సర్కారు రావాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ:

 

బీజేపీ కౌన్సిలర్ లను గెలిపించి బీజేపీ అభ్యర్థిని చైర్మెన్ చేస్తే ఎమ్మెల్యే తో కలిపి ట్రిబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో బీజేపీ కౌన్సిలర్ లను గెలిపించి బీజేపీ అభ్యర్థిని చైర్మెన్ చేస్తే ఎమ్మెల్యే తో కలిపి ట్రిబుల్ ఇంజన్ సర్కారు వస్తుందనీ అప్పుడు ఏ ఆటంకం లేకుండా జిల్లా అభివృద్ధి అవుతుందనీ అన్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందనీ ప్రతి వార్డులో బీజేపీ కార్యకర్త గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే లు అరుణతార, ఎండల లక్ష్మీనారాయణ, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Triple engine government should come in Kamareddy

More articles

Latest article