కామారెడ్డి లో ట్రిబుల్ ఇంజన్ సర్కారు రావాలి

కామారెడ్డి, బతుకమ్మ:   బీజేపీ కౌన్సిలర్ లను గెలిపించి బీజేపీ అభ్యర్థిని చైర్మెన్ చేస్తే ఎమ్మెల్యే తో కలిపి ట్రిబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో బీజేపీ కౌన్సిలర్ లను గెలిపించి బీజేపీ అభ్యర్థిని చైర్మెన్ చేస్తే...