28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పాముకాటుతో బాలిక మృతి

Must read

📰 Generate e-Paper Clip

గాంధారి, బతుకమ్మ : 

 

కామారెడ్డి జిల్లాలో బాలిక పాము కాటు తో మృతి చెందింది. ఈ సంఘటన గాంధారి మండలంలోని మేడిపల్లిలోని చందా నాయక్ తండ గ్రామానికి చెందిన కేతావత్ మాయ పాముకాటుతో శనివారం ఉదయం మరణించింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం  తల్లి శోభతో కలిసి మాయ పొలంలో పనులు చేసేందుకు వెళ్ళింది. మాయ ఫోన్ చూసుకుంటూ ఉండగా తల్లి ఒడ్డుకు వచ్చింది.మాయ తల్లి కోసం ఒడ్డుకు వస్తుండగా  పాము మీద కాలు వేయడంతో పాము  కరిచింది. ఈ విషయం తల్లికి చెప్పగా  చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో మాయ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద చేయాలని నెలకొన్నాయి. మాయకు తండ్రి లేకపోవడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.

Seven-year-old girl dies from snakebite

More articles

Latest article