. . . పాఠశాలలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం
భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండల కేంద్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం శిశుమందిర్ పాఠశాలలో పండితులు సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. వసంత పంచమి విశిష్టత గురించి పండితులు వివరించారు. సరస్వతి దేవి ఆశీస్సులు ఉన్న వారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగి జ్ఞానమనే వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

