24 C
Hyderabad
Sunday, August 2, 2026

మెగా రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండల కేంద్రంలోని టోల్ ప్లాజాలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. టోల్ ప్లాజా కు చెందిన 26 మంది ఉద్యోగులు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రోడ్డుపైన ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుందని టోల్ ప్లాజా మేనేజర్ దుర్గాప్రసాద్, ముని ప్రకాష్, రక్తదాన ప్రతినిధి బాలు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సంపత్ కుమార్, పోలీస్ సిబ్బంది ఉద్యోగులు బత్తుల రాకేష్, మన్నె మనోజ్, జితేందర్, సురేష్, అఖిల్ యువకులు ఉన్నారు.

 

Mega blood donation camp
Mega blood donation camp

More articles

Latest article