. . . బంగారం, వెండి వస్తువులు లభ్యం
. . . రెండు బైక్ లు, ఒక ఆటో స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని 1వ టౌన్ పరిధిలోని పూసలగల్లీ లో ఓ ఇంట్లో చోరికి పాల్పడిన ముగ్గురు దొంగలు ముఠాను అరెస్టు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పూసలగల్లిలో ఓ ఇంట్లో చోరికి పాల్పడగా కేసు నమోదు చేసుకుని ప్రత్యేక పహారా, గట్టి పర్యవేక్షణ చర్యలు చేపట్టి, దర్యాప్తును వేగవంతం చేసి ఫింగర్ ప్రింట్స్, సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తీసుకొని ముగ్గురు దొంగల షేక్ సాధిక్, మారటి మాధవ్, షేక్ ఇస్మాయిల్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి వెండి పెద్ద ప్లేట్ – 234.09 గ్రాములు, వెండి చిన్న ప్లేట్లు (2) – 204.12 గ్రాములు, గోల్డ్ బుట్ట కమ్మలు – 8.75 గ్రాములు గోల్డ్ మాటిలు – 3.58 గ్రాములు, గోల్డ్ డిజైన్ ఉంగరం – 2.31 గ్రాములు, రెండు బైక్ ప్యాషన్ ప్రో ఏపీ 25 ఏజీ 1796, హోండా బైక్ – ఏపీ 23 కే 8633, ఒక ఆటో – టీ ఎస్ 16 యూబి 3971 స్వాధీనం చేసుకుని కోర్టు లో హాజరు పరిచ్చినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
… ప్రజలకు పోలీసుల సూచనలు
ఇళ్లలో తప్పనిసరిగా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, అవి సక్రమంగా పని చేస్తున్నాయా లేదా తరచూ తనిఖీ చేయాలని, ఇంటిని తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో తలుపులు, కిటికీలు సరిగా మూసివున్నాయా లేదో నిర్ధారించుకోవాలన్నారు. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఎక్కువగా ఇంట్లో ఉంచకుండా, వీలైనంత వరకు బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలన్నారు. ఇంటిని ఎక్కువ రోజులు ఖాళీగా వదిలివెళ్లాల్సి వస్తే, పొరుగువారికి ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినా, లేదా అసాధారణ కదలికలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాత్రి సమయంలో ఇళ్ల ముందు వెలుతురు ఉండేలా చూసుకోవడం ద్వారా దొంగతనాల అవకాశాన్ని తగ్గించవచ్చన్నారు. ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టేందుకు నగరంలో పహారా, పర్యవేక్షణ ప్రత్యేక దర్యాప్తు చర్యలను మరింత బలోపేతం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతోనే నేరాలను పూర్తిగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

