. . . మహిళల అభ్యున్నతికై కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది
. . . రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
భీంగల్, బతుకమ్మ :
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలనే లక్ష్యంతో సీ.ఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం బాల్కొండ కానిస్టెన్సీ లోని సావెల్, భీమ్ గల్, మెండోరా గ్రామాల్లో పర్యటించిన మంత్రి మెండోర మండలం సావెల్ గ్రామంలో గ్రామం నుండి తడపాకల్ రోడ్డు వరకు రూ.2.14 కోట్ల సీఆర్ఆర్ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు భీంగల్ మున్సిపాలిటీలో రూ.11.5 కోట్లు టీయుఎఫ్ఐడీసీ నిధులు, రూ.25 కోట్లు అమృత్ 2.0, రూ.15 కోట్లు నగర అభివృద్ధి పనులకు, భీంగల్ మండలంలోని మెండోరా నుండి నర్సాపూర్ గ్రామం వరకు రూ.1.85 కోట్ల సీఆర్ఆర్ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా భీంగల్ లొ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించి, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల సహాయం చేసి ఆత్మ గౌరవంతో బతికేలా చేశారని అన్నారు. మహిళలంతా మహిళా సంఘాలను తిరిగి ఏర్పాటు చేసుకోవాలని, మహిళా సంఘాల్లోని సభ్యులకు పది లక్షల బీమా, రెండు లక్షల ప్రమాద బీమాని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మహిళలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు జీరో వడ్డీతో రుణాలను అందిస్తుందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం భీంగల్ సర్కిల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భీంగల్ లో నిర్వహించిన అరైవ్ ఆలైవ్ బైక్ ర్యాలీ కార్యక్రమంలో మంత్రి హెల్మెట్ ధరించి ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, భీమ్ గల్ మండల పార్టీ ప్రెసిడెంట్ బోదిరి స్వామి, మాజీ ఎం. పి. పి కన్నె సురేందర్, డీ సీ సీ డెలికెట్ కుంట రమేష్, జె జె నర్సయ్య, ఎస్టీ సెల్ మండల్ ప్రెసిడెంట్ గోపాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



