25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ విశ్వవిద్యాలయ డైరెక్టర్ గా డాక్టర్ కే.వి.రమణాచారి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు ఆదేశాలకు అనుగుణంగా డాక్టర్ కే.వీ. రమణాచారిని డైరెక్టర్ పిఓఆర్ గా నియమిస్తూ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ కే.వీ. రమణాచారి గతంలో బీసీ సెల్ డైరెక్టర్గా, అడిషనల్ కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్స్ (యూజీ )గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కాంపిటీటివ్ సెల్ డైరెక్టర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే తనను అభినందించిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు.

More articles

Latest article