ఏర్గట్ల, బతుకమ్మ:
మండల కేంద్రంలో 29 మంది లబ్ధిదారులకు నూతనంగా ఇంటి నిర్మాణం కొరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇట్టి సందర్భంలో లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో పేదలైన మాకు ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయల మంజూరు జరిగి ప్రొసీడింగ్ పత్రాలు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు పన్నాల నర్సారెడ్డి, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు గన్నారపు రాజేశ్వర్, సంగెం ఆనంద్, కారుపాకల నవీన్, గ్రామపంచాయతీ కార్యదర్శి జాకీర్, సిబ్బంది పాల్గొన్నారు.
