ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల అందజేత
ఏర్గట్ల, బతుకమ్మ: మండల కేంద్రంలో 29 మంది లబ్ధిదారులకు నూతనంగా ఇంటి నిర్మాణం కొరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇట్టి సందర్భంలో లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో పేదలైన మాకు ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయల మంజూరు జరిగి ప్రొసీడింగ్ పత్రాలు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు....