25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ జిల్లాలో డీజేలు నిషేదం

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి
  • నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు డీజేలు నిషేదిస్తున్నట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. నగరంలోని అంబేద్కర్ భవన్ లో సౌండ్ సిస్టం యజమానులకు, దుకాణదారులకు గురువారం పోలీసు ఆధ్వర్యంలో కౌన్సలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సౌండ్ సిస్టం వాడకం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై వివరించారు. ఇక ముందు డీజేలు కలిగి ఉండాలంటే పోలీస్ కమిషనర్ అనుమతి తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఫంక్షన్లకు  సౌండ్ సిస్టం కిరాయికి ఇవ్వాలని సూచించారు. అనుమతి తీసుకోని వారిపై కేసులు నమోదు చేసి సౌండ్ సిస్టంను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఒకటో పోలీస్ స్టేషన్ అధికారి రఘుపతి, నిజామాబాద్ సర్కిల్ అధికారి శ్రీనివాస్ రాజ్, నిజామాబాద్ సౌత్ రూరల్ అధికారి సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
  • DJs are banned in Nizamabad district

More articles

Latest article