27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

7వ డివిజన్ బీజేపీ నుంచి బంటు రాము ధరఖాస్తు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో 7 వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి మున్సిపల్ లైసెన్స్ ఇంజనీరు బంటు రాము దరఖాస్తు చేసుకున్నారు.  మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కి దరఖాస్తు చేసుకున్నారు.35 సంవత్సరాలుగా మున్సిపల్ లైసెన్స్ ఇంజనీరుగా ప్రజలకు సేవచేస్తూనే జిల్లా ప్రజలకు సుపరిచితుడినని,  ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు బీసీ జనరల్ గా రావడం తో ప్రత్యక్ష రాజకీయాల ద్వారా 7వ డివిజన్ ప్రజలకు మరింత సేవ చెయ్యాలన్న లక్ష్యం తో బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిపారు.కాలనీ సమస్యల పై సంపూర్ణ అవగాహన కలిగి పార్లమెంట్ సభ్యులు అరవింద్,అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సహకారం తో కాలనీ అభివృద్ధికి ఎంతో దోహదం చేశారని కాలని వాసులు చెబుతున్నారు.బంటు రామును బీజేపీ కార్పొరేట్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన గెలుపులో మేమంతా ఐక్యంగా ఉండి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించి బీజేపీ ఖాతాలో 7 వ డివిజన్ ను కానుకగా ఇస్తానని ధీమా  వ్యక్తం చేశారు..ప్రజల ఆశీర్వాదం ఉన్న తనకు బీజేపీ పార్టీ కార్పొరేటర్ టికెట్ కేటాయిస్తే ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేయడం లో తాను సైతం సమీదగా బీజేపీ కోసం పని చేస్తానని బంటు రాము పేర్కొన్నారు.తనకు టికెట్ ఇచ్చి కార్పొరేటర్ అయ్యే అవకాశాన్ని కల్పించాలని కోరారు.

Bantu Ramu's application from 7th Division BJP

More articles

Latest article