24 C
Hyderabad
Sunday, August 2, 2026

బైక్ దొంగతనం చేసిన వ్యక్తికి రిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ :

 

బైకులు దొంగతనం చేసిన వ్యక్తి ని రిమాండ్ కు పంపినట్లు మెండోరా ఎస్సై సుహసిని తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ మెండోరా మండలం లోని దుదూగాం గ్రామ శివారులో గల ఆర్ కే ఫంక్షన్ హాల్ దగ్గర పోచంపాడు కి చెందిన సయ్యద్ అజమ్ అనే వ్యక్తి బైకును ఈ నెల 14న దొంగలించగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశామన్నారు. దర్యాప్తులో లభించిన ఆధారాలతో నిర్మల్ కి చెందిన షిండే గణేష్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్టుగా రుజువైందని, అతనిని రిమాండ్ కి పంపినట్లు మెండోరా ఎస్సై పేర్కొన్నారు.

More articles

Latest article