24 C
Hyderabad
Sunday, August 2, 2026

మోడల్ స్కూల్ ప్రవేశానికి దరఖాస్తులు

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు లోని తెలంగాణ మోడల్ స్కూల్ 2026- 27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ ఏ.వి నర్సాగౌడ్ తెలిపారు. ఆరవ తరగతిలో 100 సీట్లు, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను అడ్మిషన్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి Telanganams.egg.gov.in వెబ్ సైట్ సందర్శించాలని, దరఖాస్తులు జనవరి 28 నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28 గా పేర్కొన్నారు. ఓసీలకు రూ.200, బీసీ, ఎస్సి, ఎస్టి, ఈడబ్ల్యూఎస్ లకు రూ.125 ఉందని, ఈ పరీక్ష ఏప్రిల్ 19న ఉండనున్నట్లు తెలియజేశారు. కాబట్టి మండలంలోని అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

More articles

Latest article