మోర్తాడ్, బతుకమ్మ :
మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన నందన్ గౌడ్ వాళ్ళ అమ్మ సాయమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆదివారం వారి కుటుంబ సభ్యులను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
