30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

బోధన్‌లో బీజేపీ విజయోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్ బతుకమ్మ:

 

బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో జరిగిన మహానగర పాలిక ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా బోధన్ పట్టణంలో ఘనంగా విజయ సంబురాలు నిర్వహించారు. ముంబైలోని 227 స్థానాలకు గానూ 127కి పైగా స్థానాల్లో గెలుపొందడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 మహానగర పాలికల్లో 26 చోట్ల బీజేపీ విజయదుందుభి మోగించిందని బోధన్ బీజేపీ పట్టణ అధ్యక్షులు పసులేటి గోపి కిషన్ పేర్కొన్నారు. ముంబై మేయర్ పీఠాన్ని తొలిసారిగా దక్కించుకోబోతున్న నేపథ్యంలో ఇది చారిత్రాత్మక విజయమని అన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుతూ ఆనందోత్సాహాలతో విజయ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, గుంత గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాజులదేవి పవన్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్, పప్పుల వేణు, కందికట్ల వాసు, గంగుల శ్రీకాంత్, అనిల్, భూమయ్య, కస్ప లింగం, ఫణి, సాగర్ గౌడ్, రాజు, శీను, బిల్లా విజయ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

BJP's victory celebrations in Bodhan
BJP’s victory celebrations in Bodhan

More articles

Latest article