ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ గా ఎకగ్రీవంగా ఎన్నికైన పద్మశ్రీకాంత్
ఎల్లారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాల్టిని కాంగ్రెస్ పార్టి కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టికి చెందిన 10 వ వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీనివాస్ చైర్మెన్ గా ఎన్నికయ్యారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపాల్టిలో జరిగిన సమావేశంలో నూతన చైర్మెన్ ఎన్నిక ఆర్డిఓ మన్నే ప్రభాకర్ అధ్వర్యంలో జరిగింది. ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ ఎక్స్ ఆఫిషియో హోదాలో హజరయ్యారు.
పద్మ శ్రీకాంత్ చైర్మెన్ అభ్యర్థిత్వాన్ని 9 మంది బలపరచడంతో అయనే ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి, అర్డిఓ ప్రభాకర్. ఈ సంధర్బంగా పద్మ శ్రీకాంత్ ను ఎమ్మెల్యే మధన్ మోహన్ తో పాటు కౌన్సిలర్ లు అభినంధించి సత్కారించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టిని బలోపేతం చేస్తామని, ఎల్లారెడ్డి బల్ధియాపై కాంగ్రెస్ జండా ఎగురడం అందుకు ఉధహరణ అని ఎమ్మెల్యే మధన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి రెండవ మున్సిపల్ చైర్మెన్ గా పద్మ శ్రీకాంత్ ఎన్నిక కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ చట్ట ప్రకారం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించినట్లు ఆర్డీవో తెలిపారు.

