30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మందు కొట్టి స్టీరింగ్ పడితే . . . జైలులో గది రెడీ

Must read

📰 Generate e-Paper Clip

. . . కామారెడ్డి జిల్లాలో ఒక్క రోజే 33 డ్రంక్ డ్రైవ్ కేసులు

. . . రూ.38,500 జరిమానా

. . . నలుగురికి రెండు రోజులు

. . . 10 మంది ఒక రోజు జైలు శిక్ష

కామారెడ్డి, బతుకమ్మ :

వాహనదారులు మందుకొట్టి స్టీరింగ్ పడితే జైలులో గది రెడీ అంటూ కామారెడ్డి పోలీసులు హెచ్చరిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సోమవారం ఒక్కరోజే 33 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ.38,500 జరిమానా విధించినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వీరిలో కోర్టు నలుగురికి రెండు రోజులు జైలు శిక్ష విధించగా, 10 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. జిల్లాలో మద్యం సేవించి వాహనం నడుపడం వల్ల ప్రత్యక్షం గానీ, పరక్షం గానీ ప్రమాదాలు కారణమౌతున్నారన్నారు. కొన్నిసార్లు మద్యం సేవించి వాహనం నడిపిన వారు స్వయంగా ప్రమాదాలకు గురై మరణిస్తుండగా, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. కామారెడ్డి జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో 23 కేసులో రూ.24,500 జరిమానా విధంగా 10 మందికి జైలు శిక్ష విధించారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు నమోదు కాగా 2 వేలు జరిమానా, బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులు నమోదు కాగా 9 వేల జరిమానా ముగ్గురికి జైలు శిక్ష, బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు నమోదు కాగా వెయ్యి జరిమానా, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదు కాగా 2 వేల జరిమానాతో పాటు ఒకరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు. మద్యం తాగి వాహనం నడుపడం వల్ల మ`త్యువుని ఆహ్వానించడమేనని, మీ నిర్లక్ష్యం వల్ల ఎదుటివరి ప్రాణాలు గాలిలో కలవకూడదు. మీ ఇంటి వద్ద మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తుందని గుర్తించుకోండి . . . ఇకనైనా వాహనాదారులు మద్యం మత్తులో వాహనం నడిపి అలవాటు మానుకోవాలన్నారు. గమ్యానికి చేరుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఎస్పీ వెల్లడించారు.

 

If you fall off the steering wheel while under the influence of drugs... you'll end up in jail.
If you fall off the steering wheel while under the influence of drugs… you’ll end up in jail.

More articles

Latest article