తొమ్మిది రోజులు రాష్ట్రంలో పండుగ సంబరాలు
మోర్తాడ్, బతుకమ్మ :
బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాండ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తెలంగాణ ప్రత్యేకగాఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నారు.
పాటల్లో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తాయి…
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగి ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు, మేలవిస్తారు బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ లోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ వర్షాకాలపు చివరిలో శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది అప్పటికే వర్షాలకు చెరువులన్నీ నీటితో జలకళ సంతరించుకుంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులతో ఆరుబయలలో పోసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పూస్తాయి. బంతి, చామంతి, నందివర్ధనం లాంటి పూలను కూడా ఈ సమయంలో పూస్తాయి. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పూలతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మను గునుగు, తంగేడు పూలతో పాటు మిగతా పూలను వలయకారంగా పేర్చుకుంటూ ఆకర్షనీయంగా బతుకమ్మను తయారుచేసి మధ్యలో పసుపు తో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయట తీసుకెళ్తా బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ ఊరేగింపుగా తీసుకువెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.
తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా….
అక్టోబర్ 2: ఎంగిలిపూల బతుకమ్మ
అక్టోబర్ 3: అటుకుల బతుకమ్మ
అక్టోబర్ 4: ముద్దపప్పు బతుకమ్మ
అక్టోబర్5: నాన బియ్యం బతుకమ్మ
అక్టోబర్ 6: అట్ల బతుకమ్మ
అక్టోబర్ 7: అలక బతుకమ్మ
అక్టోబర్ 8: వేపకాయల బతుకమ్మ
అక్టోబర్ 9: వెన్న ముద్ద బతుకమ్మ
అక్టోబర్ 10:సద్దుల బతుకమ్మ.
