25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బాల్కొండ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

. . . బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

రానున్న రోజుల్లో ఈ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీయర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి బాల్కొండ కానిస్టెన్సీ గడ్డపై బీజేపీ పార్టీ జెండాను ఎగురవేస్తామని బాల్కొండ కానిస్టెన్సీ బీజేపీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి అన్నారు.
సోమవారం ఆయన భీమ్ గల్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మొన్న జిఎస్టి ఎగ వేత కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ముత్యాల సునీల్ రెడ్డి పైన, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన పూర్తి ఆధారాలతో నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశాంత్ రెడ్డి కాంట్రాక్టుల పేరులతో బట్టాపూర్ లోని ప్రకృతి సంపదను దోచుకుని డబ్బులు కూడగట్టుకోవడం, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వ ఇంచార్జ్ అదే ప్రకృతి నుంచి ఇసుకను మాఫీయా రూపంలో హైదరాబాద్ కు తరలించడంలో ముఖ్యపాత్రులుగా ఉన్నారని పూర్తి ఆధారాలతో తెలుపడం జరిగిందన్నారు. వారు వారి స్వలాభాల గురించి రాజకీయం చేస్తున్నారు తప్ప వారిద్దరి వల్ల ప్రజలకు ఒరిగేదేం లేదన్నారు.ఇకనైనా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నోముల నర్సారెడ్డి, ముసుకు భూమేశ్వర్, కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, లక్ష్మణ్ గౌడ్, మొలిగే మహిపాల్, నవీన్ నవీన్,అజయ్,హరిప్రసాద్,ఘన చిన్న నరసయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article