. . . డిసిసి ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ డిమాండ్
ఏర్గట్ల, బతుకమ్మ :
కళ్యాణ లక్ష్మి చెక్కులు మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ద్వారా లబ్ధిదారులకు వెంటనే,పంపిణీ చేయాలని, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించ వద్దని, ప్రజా పాలనలో అహంకారానికి చోటు లేదని,
బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వం ప్రోటోకాల్ గౌరవం ఇచ్చిందని ఆ గౌరవాన్ని అతను కాపాడుకుంటే మంచిదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రజలను రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తింపుకునే సంస్కారం తమ ప్రజా ప్రభుత్వంలో లేదని తెలిపారు.
కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, దరఖాస్తులను నేరుగా మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వంలో సంవత్సరం దాటిన చెక్కులు మంజూరు కాలేదు,కానీ ఈ ప్రభుత్వంలో దరఖాస్తు చేసిన రెండు నెలలోపు చెక్కులు మంజూరు అవుతున్నాయని గుర్తు చేశారు.
గతంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దరఖాస్తు చేసుకోవాలంటే ప్రశాంత్ రెడ్డి ఇంటి చుట్టు అవమానాలు పడి తిరగాల్సి వచ్చేదని గుర్తు చేశారు,
బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఏ మండలం చెక్కులు ఆ మండలంలోనే పంచాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ డిమాండ్ చేశారు. నియంతల వ్యవహరించి అందరు నా దగ్గరకు రావాలంటే ప్రజా ప్రభుత్వంలో కుదురదని హితవు పలికారు.మండల తాసిల్దార్ లను బెదిరించి చెక్కులను ఆపడం సబబు కాదు.ఒకసారి చెక్కులు పంపిణీ జరిగాక కూడ రాని వారి చెక్కులు ఇవ్వద్దు, వారందరూ నా ఇంటికే వచ్చి చెక్కులు తీసుకోవాలి అనే అహంకారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రదర్శించొద్దు,అని రానివారు వ్యవసాయ పనులు, ఆరోగ్య సమస్యలు,ఏదైనా ఇంటి పనులు యుండి రాకపోవచ్చు అర్థం చేసుకొని ఎక్కడ అక్కడ మండల తాసిల్దార్ ఆఫీస్ లలో ఇచ్చే విధముగా ప్రతి సారి ఇచ్చేవారని, ఈసారి కొత్త రూల్స్ తేవడం అంటే ప్రజల పైన పెద్దరికం చెయ్యడమే,మీ బిఆర్ఎస్ ప్రభుత్వం యున్నప్పుడు కూడా ఇదే పద్దతి కొనసాగింది. ఇప్పటికైనా మా కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టుడు లేదు కాబట్టి మిగిలి పోయినా చెక్కులు పంపిణీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్,మండల పరిధిలో తొర్తి గ్రామ సర్పంచ్ కౌడ భూమేష్, గుమ్మిర్యాల గ్రామ సర్పంచ్ దేశ బోయిన జమున సంజీవ్ యాదవ్,దొంచంద, ఉప సర్పంచ్ ఆశిరెడ్డి హన్మంత్ రెడ్డి, ఏర్గట్ల ఉప సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్, తోర్తి గ్రామ ఉప సర్పంచ్ సుమన్ గౌడ్,నాగేంద్ర నగర్ ఉప సర్పంచ్ జాకీర్, గుమ్మిర్యాల ఉప సర్పంచ్ జై డి కిషోర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల నర్సారెడ్డి,సారంగి గంగాధర్,దండేవోయిన సాయి,మదస్తూ చిన్నయ్య, ఇబ్రహీంపట్నం చిన్న గంగాధర్, జక్కని సంతోష్, కారుపాకల నర్సయ్య,జక్కని చిన్నయ్య, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
