. . . బోదన్ నగల దుకాణంలో చోరీ కేసు చేధన
. . . ఇద్దరు దొంగలు అరెస్ట్ చేసిన పోలీసులు
. . . పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు
నిజామాబాద్ క్రైం, బోదన్ / బతుకమ్మ :
ఏటీఎంలను , బంగారం షాప్ లను దోచుకుంటున్న నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. బోధన్ పట్టణంలో గత ఏడాది డిసెంబర్ 21న రాత్రి సమయంలో రెండు బంగారు షాప్ లను షట్టర్ తాళాలు పగులగొట్టి బంగారం వెండి నగలను దోచుకున్న కేసును చేయించినట్లు తెలిపారు. ఈనెల 11న రాత్రి బోదన్ బైపాస్ రోడ్డులో గల అచన్ పల్లి వద్ద బోధన్ పట్టణ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మోటార్ సైకిల్ పై ఇద్దరు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రికి చెందిన లక్ష్మన్ సింగ్ బవురీ, ప్రేమ్ సింగ్ ధారం సింగ్ కిచ్చి లుగా గుర్తించారు. వారిద్దరు సాగర్ సింగ్, మహ్మద్ షేక్ తో కలిసి నలుగురు ముఠాగా ఏర్పడి 2024 నుంచి ఎటిఎంలు, బంగారు దుఖానాలు చోరీకి పాల్పడినట్లు తెలిపారు. తోలుత నిజామాబాద్ జిల్లా రెంజల్ లో, తర్వాత మహరాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఉమర్ ఖేడ్ లో, నిజామాబాద్ జిల్లా రుద్రూర్, నిర్మల్ జిల్లా కుబీర్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ లో చోరీకి పాల్పడ్డారు. లక్ష్మణ్ సింగ్ బవురీ, ప్రేమ్ సింగ్ ధారం సింగ్ కిచ్చి లుగా పట్టుబడగా సాగర్ సింగ్, మహ్మద్ షేక్ లు పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. పట్టుబడిన వారి వద్ధ నుంచి రెండు బైకులు, 14 తులాల బంగారు నగలు, 6 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల వద్ధ బంగారం కొనుగోలు చేసిన నాందేడ్ జిల్లా ముత్కేడ్ కు చెందిన బంగారు ఆభరణాల తయారీదారు లక్ష్మి కాంత్ సంతోష్ టాక్ తో పాటు సహకరించిన, నాందేడ్ జిల్లా ఉమ్రి గ్రామానికి చెందిన సయ్యద్ నదీం లను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు కోనసాగుతున్నాయని తెలిపారు. ఈ కేసును చేదించిన బోధన్ ఎసిపీ శ్రీనివాస్, బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట నారాయణ, బోధన్ టౌన్ ఎస్ఐ మనోజ్ కుమార్ , ఎఏస్ఐ బాబురావు ,సిబ్బంది రవి, మహేష్, సాయి కుమార్,అశోక్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.

