29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెరగాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కోయడి నర్సింహులు గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెరగాలని ప్రతిదీ అవగాహన చేసుకుని ప్రశ్నించే తత్వాన్ని అలవార్చుకొని హక్కులు, బాధ్యతలను సమానంగా ఆచారించాలని చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కోయడి నర్సింహులు గౌడ్ అన్నారు. నగరంలోని పూలాంగ్ లో గల స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రమాదాలు అలాగే సమాచార హక్కు చట్టంపై చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెడ్మాస్టార్ నాగరాజు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సొసైటీ చైర్మన్ కోయడి నర్సింలు గౌడ్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు తమ తండ్రి, అన్నదమ్ములకు వాహనం నడిపేటప్పుడు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పాలన్నారు. అతివేగం, తాగి డ్రైవింగ్ చేయడం సెల్ ఫోన్ మాట్లాడం చేయవద్దని లేనట్లయితే ప్రమాదంలో మరణం, కాళ్ళు చేతులు విరగడం లాంటి అనేక సంఘటనలు జరుగుతాయన్నారు.రోడ్డు ప్రమాదాలు లేనీ, అవినీతి లంచగొండి లేని సమాజాన్ని సాధించాలంటే విద్యార్థులు, యువకుల్లో సామాజిక అంశాలపట్ల అవగాహన, చైతన్యం అవసరం అన్నారు. అందుకే రోడ్డు భద్రత మాసత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిరహించామన్నారు. ఆర్.టి ఐ వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ రాంరాజ్ రాథోడ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరాలని భగతసింగ్, అల్లురి సీతారామరాజు లాగ యదగాలని అన్నారు.ప్రతీది ఎదిరించి పోరాడాలన్నారు. సమాచారం హక్కు చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంగాధర్, స్కూల్ స్టాఫ్ రఫత్, నిఖిత తో పాటు గంగాధర్, అశోక్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article