29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బస్తీ దవాఖానాను పరిశీలించిన డీఎంహెచ్‌ఓ రాజశ్రీ

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

బోధన్ పట్టణంలోని 32వ వార్డు చావడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డా. రాజశ్రీ , డిప్యూటీ డీఎంహెచ్‌ఓ బుధవారం పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ తో పాటు ఎఇ శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బస్తీ దవాఖానాలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, భవన నిర్మాణ నాణ్యత, మౌలిక వసతుల ఏర్పాటు తదితర అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు తెలియజేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానాల ద్వారా పట్టణ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

DMHO Rajshri inspects Basti Hospital

More articles

Latest article