26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నీటిపంపకాలపై ఉత్తమ్ కట్టుకథలు…రేవంత్ పిట్ట కథలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ’నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహులు‘ పేరిట ఆదివారం మాజీ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో పదేళ్ల బీఆర్ఎస్ పాలనను సాగునీటి స్వర్ణయుగంగా సాగిందని, రెండేళ్ల బీఆర్ఎస్ పాలను అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. నీటిపంపకాలపై  ఉత్తమ్ కట్టుకథలు చెప్తే.. రేవంత్ పిట్ట కథలు చెప్పారన్నారు.తాము రాజకీయాల కోసం ఈపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం లేదనేది అందరు గ్రహించాలని హరీశ్ రావు కోరారు, కాళేశ్వరంపై కక్ష కట్టిండ్రు.. పాలమూరుపై పగబట్టిండ్రు అని, పాలరమూరు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్సేనని ఆరోపించారు. సీఎం మాటలు మోకాలు- బోడిగుండుకు ముడిపెట్టేలా ఉన్నాయని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని హరీశ్ రావు పేర్కొన్నారు.

More articles

Latest article