నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాతిపిత గాంధీ జయంతి రోజున నగరంలోని శ్రీనగర్ కాలనీవాసులు శాంతి మార్గంలో నిరసన చేపట్టారు. గాంధీజీ చిత్రంతో ఫ్లెక్సీని రూపొందించి దానిపై తమ కాలనీ సమస్యలను వివరించారు. అర్బన్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ శ్రీనగర్ రోడ్డు నం.3 కాలనీ నిరాదరణకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తారు రోడ్డు లేదా సీసీ రోడ్డు నిర్మాణంతోపాటు 40ఫీట్ల డ్డుపై ఉన్న మూడు విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఎమ్మెల్యే ధన్ పాల్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ ను కోరారు.