హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం నూతన సంవత్సరం ను పురస్కరించుకొని సీఎంను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన నగేష్ రెడ్డి. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్టు కాట్ పల్లి నగేష్ రెడ్డి తెలిపారు.వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ , ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

