పోచారం భాస్కర్ రెడ్డి నోరు జాగ్రత్త

0 8,630

 

. . . నీకు నీ తండ్రికి పదవి భిక్ష పెట్టింది  కేసీఆర్

. . . నిన్ను పదవి నుంచి పీకేసింది కాంగ్రెస్ పార్టీ అని మరవద్దు

. . .  నాయకులు యలమంచిలి శ్రీనివాస్

కోటగిరి , బతుకమ్మ :

పోచారం భాస్కర్ రెడ్డి నోరు జాగ్రత్త… నీ తండ్రి కి నీకు పదవి బిక్ష పెట్టిందే  కేసీఆర్, కేటీఆర్ ఏ అని బిఆర్ఎస్ నాయకులు యలమంచిలి  శ్రీనివాస్ అన్నారు.ఇటీవల బాన్సువాడ   కేంద్రంగా ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్ ల  సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై  మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ  కోటగిరి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… నాలుగు సార్లు టిఆర్ఎస్ పార్టీ బిక్షతో గెలిచినా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓ కాంగ్రెస్ నాయకుడికి భయపడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి నీ తండ్రి అని పోచారం భాస్కర్ రెడ్డికి గుర్తు చేశారు. తల్లి లాంటి పార్టీ కి ద్రోహం చేసి అధికార వ్యామోహం తో  పార్టీ మారిన మీరు  కేటీఆర్ ను విమర్శించేంత స్థాయి కాదని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ ద్వారా డిసిసిబి చైర్మన్ అయిన నిన్ను  పదవి నుంచి దించింది కాంగ్రెస్ పార్టీనే అని మర్చిపోవద్దు ఆయన అన్నారు.. గత  పది సంవత్సరాలలో కెసిఆర్, కేటీఆర్  ఇచ్చిన నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చచ్చేంత వరకు కేసీఆర్ వెంట ఉంటానంటూ నీ తండ్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి  వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసిన మాట గుర్తుందా అని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని  ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, పోచారం భాస్కర్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోవాలి అని హెచ్చరించారు. నిజంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు ప్రకటించుకోవాలని  సవాలు విసిరారు. ఏ పార్టీలో ఉన్నారో అన్న క్లారిటీ లేని మీరు  మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి రత్నాకర్, మూచి గణేష్, చందర్ శివ,సూరి, వర్ని ఎజాస్, కోటగిరి మండల నాయకులు మోరే కిషన్, తెల్ల రవికుమార్,మాజీ కో ఆప్షన్ సభ్యులు హకీం, సూధం  నవీన్, సమీర్, బీర్కూర్ సర్పంచ్  ధర్మతేజ, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఫారుక్, దేవేందర్ చల్లపల్లి, ఆరిఫ్, నజీర్, అంబటి గంగ ప్రసాద్ గౌడ్,గగన్, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.