26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆటో, బుల్లెట్ బైక్ ఢీ : ఇద్దరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :   ఆటో, బుల్లెట్ బైక్ ఢీకొన్న  ఆర్మూర్​ మండలం అంకాపూర్​ గ్రామ శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఈఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్​ నుంచి జానకంపేట్​కు సుమారు ఆరుగురు వ్యక్తులతో ఆటో వెళ్తోంది. అలాగే నిజామాబాద్​ నుంచి రాయల్​ బుల్లెట్ బైక్​పై ఆర్మూర్​కు సాయికిరణ్​ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అంకాపూర్​ వద్ద ఆటో, బైక్​ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జానంకపేట్​ గ్రామానికి చెందిన సంధ్యారాణి, బైక్​పై ప్రయాణిస్తున్న సాయికిరణ్​ సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలాాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Auto and bullet bike collide: Two dead


Auto and bullet bike collide: Two dead

సంధ్యా రాణి  (ఫైల్)

 

More articles

Latest article