30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ లో గల విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఆదివారం కొలువుదీరింది. సంఘం భవనంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , మాజీ ఎమ్మెల్సీ ఆకుల  లలిత  ప్రమాణస్వీకారం చేయించారు.  ఈ సందర్భంగా  రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ సంఘాలు ఐక్యత తో ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుంది అన్నారు. నాకు తెలిసి నిజామాబాద్ జిల్లా లో ఈ సంఘం మొదటి సంఘం రానున్న రోజుల్లో సంఘం డేవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘం కోసం  నా వంతు గా సహాయ సహకారాలు అందిస్తాను  అని తెలిపారు. నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గం సంఘం అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను శాలువతో సత్కరించారు.  సంఘం నూతన అధ్యక్షుడు కోరటి కిరణ్  పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

More articles

Latest article