ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ లో గల విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఆదివారం కొలువుదీరింది. సంఘం భవనంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ సంఘాలు ఐక్యత తో ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుంది అన్నారు. నాకు తెలిసి నిజామాబాద్ జిల్లా లో ఈ సంఘం...