24 C
Hyderabad
Sunday, August 2, 2026

అప్పుల బాధతో దంపతుల సూసైడ్

Must read

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, బతుకమ్మ :  అప్పుల బాధతో భార్య, బిడ్డలకు విషం ఇచ్చి తాను కూడా విషం తాగి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈవిషాద ఘటన  సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది.  వివరాలు ఇలా ఉన్నాయి… బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, భార్య రుక్మిణి, కూతురు హరిప్రియ(3) బెజ్జంకిలో నివసిస్తూ దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. అక్కడే అద్దె గదిలో నివసిస్తున్నారు. దుకాణం నిర్వహణకు,  కుటుంబ పోషణకు శ్రీహర్ష అప్పులు చేశాడు.  మరికొందరికి మధ్యవర్తిగా ఉంటూ ఇతరుల వద్ద అప్పు ఇప్పించాడు.అప్పు ఇచ్చిన వారి నుంచి కొద్దిరోజులగా వేధింపులు ఎక్కువకావడంతో మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ నోట్ రాసి ఈదారుణానికి పాల్పడ్డాడు.  నమ్మిన స్నేహితులు, బంధువులు వేధించారని శ్రీహర్ష లేఖలో తెలిపారు. అలాగే  తన మృతికి నలుగురు వ్యక్తులు కారణమని వారిపై చర్యలు  తీసుకోవాలని పోలీసులను అభ్యర్థిస్తు లేఖలో పేర్కొన్నారు.  తనను, తన భార్య, బిడ్డను ఒకే పాడె పై ఉంచి దహనం చేయాలని లేఖలో పేర్కొన్నారు  కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article