అప్పుల బాధతో దంపతుల సూసైడ్
సిద్దిపేట, బతుకమ్మ : అప్పుల బాధతో భార్య, బిడ్డలకు విషం ఇచ్చి తాను కూడా విషం తాగి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈవిషాద ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, భార్య రుక్మిణి, కూతురు హరిప్రియ(3) బెజ్జంకిలో నివసిస్తూ దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. అక్కడే అద్దె గదిలో నివసిస్తున్నారు. దుకాణం నిర్వహణకు, కుటుంబ పోషణకు శ్రీహర్ష అప్పులు చేశాడు. మరికొందరికి మధ్యవర్తిగా ఉంటూ ఇతరుల...