ఆసిఫాబాద్, బతుకమ్మ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరామేరి మండలం పరందోలి ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. డ్రైవర్ చాకచక్యంగా పత్తి చేనులోకి మళ్లించడంతో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు గమనించి గాయపడ్డ వారిని ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
