27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

 లారీ డ్రైవర్ పై అగంతకుల కాల్పులు

Must read

📰 Generate e-Paper Clip

. . . జాతీయ రహదారిపై ఘటన

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44పై మంగళవారం అగంతకులు జరిపిన కాల్పుల్లో లారీ డ్రైవర్ హతమయ్యాడు. ఈ సంఘటన ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీతాండ వద్ద చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి లారీలో దేవీతాండ వద్ద ఉన్న దాబా వద్ద నిలిపాడు. అక్కడికి మరో లారీలో వచ్చిన ఇద్దరు అగంతకులు సల్మాన్ పై కాల్పులు జరిపారు. దాంతో సల్మాన్ అక్కడికక్కడే మ`తి చెందాడు. దుండగులు తాము ప్రయాణించిన లారీని చంద్రాయన్ పల్లి అటవీ ప్రాంతంలో వదిలేసి పరారీ అయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్ హత్యకు పాతకక్షలే కారణమా? లేక మరో ఏదైనా నేరాల కోణం ఉందానే విచారణ జరుపుతున్నారు.

More articles

Latest article