. . . అంబారీ పేటలో లేగ దూడ ని చంపింది పెద్దపులి
. . . పాదముద్రల ద్వార టైగర్ గా నిర్ధారించిన ఫారెస్ట్ అధికారులు
. . . పులి కోసం అటవీ అధికారుల వేట షూరు
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను, అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేట శివారులో లేగ దూడను చిరుత చంపిందని రైతు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలంలో ఉన్న పాదముద్రలు( ప్లగ్ మార్క్) ల ద్వార లేగ దూడ ని చంపింది చిరుత కాదు పెద్ధ పులేనని నిర్ధారించారు.

ఆదివారం రాత్రి ఈ విషయం ఆటవి అధికారులు రూడి చేయడంతో జిల్లా అటవీ అధికారులతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లా అధికారులు సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లాలో ఆరు టీంలను ఏర్పాటు చేసి టైగర్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కామారెడ్డి జిల్లా దోమకొండ, ఫరిద్ పేట్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇటు మాచారెడ్డి ఆటవి ప్రాంతంలోను ఆటవి శాఖాధికారులు వేట మొదలు పెట్టారు….

అంబారీ పేటలో లేగ దూడ ని చంపింది ఎస్ 12 లేనా?
కామారెడ్డి జిల్లా అంబారీ పెటలో శనివారం రాత్రి లేగదూడను చంపింది పెద్ధపులి అని నిర్ధారణ కావడంతో ఆటవి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ యేడాది జూలై 2 వ వారంలో మాచారెడ్డి ఆటవి రెంజ్ పరిధిలోని రెడ్డి పేట మండలం స్కూల్ తండా ప్రాంతంలో పెద్దపులి అవును చంపివేసింది. దాదాపు మూడు దశాబ్దాల ఉమ్మడి జిల్లాలో పెద్ధపులి సంచారం ఫారెస్ట్ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. స్కూల్ తండా ప్రాంతంలో అవును చంపింది ఎస్-12 అనె పెద్దపులి గా గుర్తించారు. తడోబా రిజర్వ్ పారేస్టు నుంచి వచ్చిందని నిర్ధారణకు వచ్చిన అటవి అధికారులు దాని అడుగు జాడలు గుర్తించేందుకు ట్రాక్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు ఉపయోగించిన దాని అనవాళ్లు గుర్తించలేకపోయారు స్కూల్ తండా అటవి ప్రాంతంలో ఎస్ 12 పై విష ప్రయోగం కేసులో 4 గురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. . అదే వారంలో సిరికోండ రిజర్వ్ పారేస్టులో దాని పాదముద్రలను చివరి సారిగా అటవీ అధికారులు గుర్తించారు. దాని తర్వాత అది రాజన్న సిరిసిల్ల జిల్లా మీదుగా వెళ్లి పోయి ఉంటుందని బావించారు. కానీ ఎస్ 12( పెద్ధపులి) జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. పెద్ధపులిని మట్టుబెట్టారనే ప్రచారం జరిగింది. కానీ అధికారులు దాన్ని ధ్రువీకరించలేదు.. ఈ విషయం మరుగున పడింది..

అంబారిపేట లో అనవాళ్లు మంచిర్యాలలో సంచరిస్తున్న పులి వి కావచ్చు ?
కామారెడ్డి జిల్లా అంబారీపేట పేటలో సంచరించింది పెద్ద పులి కావడంతో అటవి అధికారులు అప్రమత్తం అయ్యారు. జూలైలో జిల్లాలో మాచారెడ్డి ఆటవి ప్రాంతంలో అవును చంపి కనిపించకుండా పోయిన పెద్దపులి( ఎస్-12) ఆనవాళ్లను గుర్తించడంలో అటవి అధికారులు విఫలం అయ్యారు. అది జీవించి ఉందా లేక చనిపోయిందా అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ నేపథ్యంలో అటవి అధికారులు అంబారిపేటలో సంచరించిన పులి ప్లగ్ మార్కులు( పాదముద్రలు) ద్వారా దానిని గుర్తించే పనిలో పడ్డారు. ఇటీవల కాలంలో మంచిర్యాల-ఆసిఫాబాద్ అడవుల్లో ఒక పెద్దపులి సంచారం ను గుర్తించారు. అదే పెద్ద పుల్లి కావచ్చని ఆటవి శాఖ అధికారులు అంటున్నారు. అసలు మంచిర్యాల జిల్లాకు కామారెడ్డి జిల్లాకు కనెక్టివిటీ కలిగిన ఫారెస్ట్ లేదు. ఐతే ఇటివల కాలంలో పెద్దపులి ఆటవి ప్రాంతాల్లో కంటే జనారణ్యంలోకి రావడం తెలిసిందే. తడోబా ఫారెస్ట్ నుంచి ఎస్-12 వచ్చినప్పుడు… మంచిర్యాల నుంచి రావడంలో అనుమానం ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంబారీపేట శివారులో దోమకొండలో అంతగా రిజర్వ్ ఫారెస్ట్ లాంటివి లేదు.పెద్ధ పులి వెలితే పూర్వపు మెదక్ జిల్లా లేదా తిరిగి మాచారెడ్డి ఆటవీ ప్రాంతం వైపు వెల్లి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధరణంగా పెద్దపులి వేటకు వెళ్ళినప్పుడు 20 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అటవి అధికారులు చెబుతున్నారు. అంబారిపేట లో శివారులో లేగదూడను చంపిన ప్రాంతంలో మళ్లీ సంచరించే అవకాశం ఉందని అక్కడ ట్రాక్ కెమెరాలు పెట్టి పెద్దపులి ఆనవాళ్ల కోసం అటవీ శాఖ కాచుక కుర్చుంది.

