కోటగిరి, బతుకమ్మ : తన ఓటు రాలేదని ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ ఓటరు అడిషనల్ కలెక్టర్ అంకిత్ ముందే స్థానిక ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు నిలదీసిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. దుప్పలపాటి బాబురావు(70) అనే వ్యక్తి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నప్పటికీ తన ఓటు హక్కును మాత్రం స్వగ్రామం కోటగిరి వినియోగించుకుంటున్నాడు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం భార్య భర్తలు కోటగిరికి రాగా తన భార్యకు ఓటు ఉన్నప్పటికీ తనకు ఓటర్ ఐడీ కార్డ్ ఉన్న ఓటు కనిపించడం లేదని వాపోయారు. ఈవిషయం అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదంటూ పోలింగ్ కేంద్రం వద్ద అడిషనల్ కలెక్టర్ అంకిత్ ముందే స్థానిక ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శనీ నిలదీయగా పట్టించుకోకుండా వెళ్లిపోవడం గమనార్థం. ఓటరు నమోదు ప్రక్రియకు బీఎల్ వో ల ద్వారా తూతూ మంత్రంగా సర్వేలు చేయడంతోనే బతికున్న నన్ను చచ్చిన వాడిగా లెక్క గట్టి నా ఓటును తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

