విన్నవించిన …. వినిపించుకోలేదు..

కోటగిరి, బతుకమ్మ :  తన ఓటు రాలేదని ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ ఓటరు అడిషనల్ కలెక్టర్ అంకిత్ ముందే స్థానిక ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు నిలదీసిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. దుప్పలపాటి బాబురావు(70) అనే వ్యక్తి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నప్పటికీ తన ఓటు హక్కును మాత్రం స్వగ్రామం కోటగిరి వినియోగించుకుంటున్నాడు.  స్థానిక ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం భార్య భర్తలు కోటగిరికి రాగా...