మోర్తాడ్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కు చెందిన కరుణ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ హ్యూమన్ రైట్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ సరస్వతి పరిషత్ కళ భవన్ లో ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు. పేదలకు, అనాధలకు, నిరాశ్రయులకు, అభాగ్యులకు సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలో అత్యుత్తమ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని ఎందరో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న కరుణ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకోవడం సంతోష కరమైన విషయం అని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ అన్నారు. తన సేవలను గుర్తించి గ్లోబల్ ఐకాన్ అవార్డు తో సన్మనించినందుకు చాలా సంతోషంగా ఉందని మహేష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషినల్ డీ ఏస్ పీ సైదులు, నేషనల్ చిప్ జస్టిస్ రాజు, హైకోర్టు న్యాయవాది కడారి రమేష్, నోముల సంపత్, నిజామాబాద్ జిల్లా పీఆర్వో లింగం తదితరులు పాల్గొన్నారు.
