28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మొదటి విడత జీపీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎన్నికల నిర్వహణకు 1384 మంది సిబ్బంది నియామకం

. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహణకు అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మొదటి విడత బోధన్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 11 మండలాల్లో 1084 గ్రామపంచాయతీ 1642 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల కోసం  268 పోలింగ్ కేంద్రాల్లో 2,61,210 మంది ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖ పరంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకుగాను సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో మూడు చెక్ పోస్ట్ లను ( సాలూర , కండ్ గావ్, పోతంగల్ ) ఏర్పాటు చేసి నిర్విరామంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24 / 7 వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు లిక్కర్ మొత్తం 361.46 లీటర్లు సీజ్ చేయడం జరిగింది, వాటి విలువ దాదాపు 2,56,985 అని తెలిపారు.బోధన్ డివిజన్ పరిధిలో బైండోవర్ లు మొత్తం 183 మందిని సంబంధిత తహసీల్దార్ ముందు హాజరు పరిచి బైండోవర్ చేయడం జరిగిందని సిపి పెర్కోన్నారు. బోధన్ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన  నియమావళి ని ఉల్లంఘించిన టువంటి వారిపై మూడు కేసులు నమోదు చేయడం జరిగింది . ఎడపల్లి , బోధన్ రూరల్ , కోటగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. డివిజన్ పరిధిలోని మొత్తం 10 గన్ లైసెన్స్ కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని తెలియజేయగా ఆరుగురు డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా నాలుగు గన్ లైసెన్స్ బ్యాంకులకు సంబంధించినవని తెలిపారు.ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 1384 మందిని సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

More articles

Latest article