30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్లు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీసీ ఉద్యోగుల జె  ఏ సి చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించి బీసీ యువతను ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలని బీసీ ఉద్యోగుల జె  ఏ సి చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం  నిజామాబాద్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి చంద్రశేఖర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… అగ్రవర్ణాలకు కల్పించిన పది శాతం  ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ను వెంటనే రద్దు చేసి, ఆ కోటాను బీసీలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ, రంగాల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని, బీసీ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నెలకు 700 కోట్లు కేటాయించారు అని ప్రకటిస్తున్నారు కానీ వాస్తవంగా పేమెంట్ ఎవరికి జరుగుతున్నవి అర్థం కావడం లేదు అన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు వారు 33 సంవత్సరాలు ప్రభుత్వ పథకాల అమలుకు నిర్విరామంగా కృషి చేసి చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపారు. చివరకు రిటైర్డ్  ఉద్యోగులు బ్యాంకు రుణ కిస్తీ  కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కావున ప్రభుత్వం వెంబడే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలి అన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ  జాక్ కోఆర్డినేటర్  డాక్టర్ దేశ బోయిన రమ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు  50% ఫిట్మెంట్ ఇచ్చి వేతన సవరణ చేయాలని పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిల విడుదల చేయాలని కోరారు.  రిజర్వేషన్ల ఉద్యమంలో రాజీలేదని, ప్రమోషన్స్ లో బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేస్తామని త్వరలో లక్షలాది బీసీలకు సమావేశం నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు.ఈ సమావేశం లో రాష్ట్ర  బీసీ ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ రా సూరి జ్ఞానేశ్వర్ కార్యదర్శి మహేంద్ర సాగర్  బీసీ  ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారులు బుస్సా ఆంజనేయులు,బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరిపే రవీందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి నారాయణ రెడ్డి, బీసీ ఉద్యోగుల సంఘం  ఉపాధ్యక్షులు శ్రీనివాస్   ,దయానంద్ ,బసవ సాయి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

BC employees should be provided with reservation in promotion

More articles

Latest article