27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

.
బోధన్ , బతుకమ్మ :

గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నవీపేట్ మండలం అభంగపట్నం, ఎడపల్లి మండలం జానకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య, సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలకు మినహాయించి, మిగిలిన స్థానాలకు మాత్రమే ఎన్నిక జరపాలని, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ ముగిసిన తరువాత జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించాలని, కోరంను సరిచూసుకుని ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించాలని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఎన్నికల నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సందర్భంగా జానకంపేటలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్న ప్రక్రియను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో కూడా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి, ఓటర్లకు వారి ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందనే వివరాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Collector visits polling stations

రేషన్ దుకాణం ఆకస్మిక తనిఖీ……

అనంతరం కలెక్టర్ ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ లోని రేషన్ దుకాణాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్దిదారులకు సన్న బియ్యం సజావుగా పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలన జరిపారు. రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలలోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం నిల్వలు కేటాయించబడ్డాయా అని ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది, ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని రేషన్ డీలర్ కు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు

More articles

Latest article