పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
. బోధన్ , బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నవీపేట్ మండలం అభంగపట్నం, ఎడపల్లి మండలం జానకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య, సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలకు మినహాయించి, మిగిలిన స్థానాలకు మాత్రమే ఎన్నిక జరపాలని, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్...