వెబ్ న్యూస్, బతుకమ్మ : కారులో మంటలు వ్యాపించి ఎస్సై సజీవ దహనమైన ఘటన శనివారం కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్ (38) ధారవాద లో ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళుతున్నారు. అన్నిగెరె వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే యత్నంలో పక్కనే ఉన్న వంతెనను కారు ఢీకొంది. దీంతో కారులో మంటలు వ్యాపించి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
