29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

14న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

 రిసెప్షన్ కమిటీ ఏర్పాటు
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగాఅక్టోబర్ 14న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు హజ్రత్ మౌలానా ముఫ్తీ సయీద్ అక్బర్ సాహిబ్ ఇమామ్ తెలిపారు. సోమవారం నగరంలోని బ్లూ డైమండ్ ఫంక్షన్ హాల్ ఖిల్లా రోడ్‌లో అఖిలపక్ష సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అన్ని మత పార్టీలకు చెందిన పండితుల, రాజకీయ,సామాజిక పార్టీల నాయకుల సలహాల తరువాత,భారతదేశంలోని ముస్లిం వ్యతిరేక పాలకుల ప్రయత్నాలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయడాన్ని ఉపసంహరించుకొవాలని కోరుతూ ఈ నెల 14న సోమవారం ఇషా నమాజు అనంతరం నిజామాబాద్ శాంతి నగర్‌లోని ఈద్గా కోట వద్ద వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ వ్యతిరేకిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ నిరసన సభ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ సాహిబ్ దామత్ బర్కథమ్ అధ్యక్షతన జరగనుంది. ప్రత్యేక అతిథులుగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ,హైదరాబాద్,జాతీయ,రాష్ట్ర,జిల్లా,స్థానిక పండితులు,నాయకులు ఉన్నారు. ఈ మహా నిరసన ర్యాలీ విజయవంతానికి రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.

More articles

Latest article