. . . ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో, నిజామాబాద్ రోటరీ సర్వీసెస్ ట్రస్ట్ వారి సహకారంతో, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత కృత్రిమ కాలు (జైపూర్ ఫుట్) పంపిణీ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై దివ్యాంగులకు కృత్రిమ కాలును అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవ దివ్యాంగుల జీవితల్లో వెలుగులను తీసుకొని వస్తుందన్నారు. రోటరీ క్లబ్ ట్రస్ట్ వారు 2009 నుండి సేవ కార్యక్రమలు చేయడం అభినందనీయమని, దివ్యాంగులకు కృత్రిమ కాలును అమర్చి వారికి నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్న ఈ రోటరీ క్లబ్ ట్రస్ట్ వారి సేవ అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగుల పునరావాసం, సాధికారత కోసం రోటరీ చేస్తున్న సేవలను కొనియాడారు. సమాజంలో దివ్యాంగుల పట్ల సహానుభూతితో అందరూ ముందుకొస్తే వారి జీవితాల్లో వెలుగు వస్తుందని తెలిపారు. రోటరీ సర్వీసెస్ ట్రస్టుకు ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ ద్వారా రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయల) ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రకటించారు. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఎటువంటి సహాయ సహకారాలైన అందిస్తానని తెలియజేశారు.ఈ నిర్ణయం సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్సీటీ చైర్మన్ ఆకుల అశోక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ రాజు, బీజేపీ నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

