వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన ఏలేటి భూమన్న ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబాన్ని మంగళవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. తనకు ఆత్మీయులైన స్వర్గీయ భూమన్న కుమారులైన రాజ్ పాల్, చిన్నరెడ్డి, సంతోష్ తో పాటి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట వేల్పూర్ మండల బీయర్ ఎస్ నాయకులు, మండల కేంద్రానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
