28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. నామపత్రాల స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలో నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, అనవసర తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

More articles

Latest article