- సర్వశిక్షా అభియాన్ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశాలు
- డిఈవోతో పాటు ఎఫ్ఏవో, ఎస్ వోలకు తాఖీదులు
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా విద్యాశాకాధికారులను టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) కొనుగోలు వివాదం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కామారెడ్డికి చెందిన ఏజెన్సీకి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ తీసుకోకముందే జమ చేసిన డబ్బుల వ్యవహరంలో విద్యాశాఖాధికారులకు సర్వశిక్షా అభియాన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనూ విద్యాశాఖాధికారులు వివరణ ఇచ్చిన దానిపై అధికారులు సంత`ప్తి చెందలేదు. జిల్లాలోని కేజీబీవీలలోని ఉన్నత తరగతుల విద్యార్థుల కోసం వేల రూపాయలు పెట్టి కొనుగోలుచేసిన టీఎల్ఎం వెనుక మతలబు ఉందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ తో పాటు ఎఫ్ఏవో నాగజ్యోతిలు, ఇతర అధికారులు రికార్డులతో హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. గతంలోనూ సమాదానాలు ఇచ్చిన కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్ప్ (ఎస్ వోలు) ఎస్పీడీ కార్యాలయానికి హాజరుకావాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. సర్వశిక్షా అభియన్ ఫైనాన్స్ కంట్రోల్ ముందు జిల్లాకు చెందిన కేజీబీవీ అధికారులు విద్యాశాఖ కార్యాలయం అధికారులు హాజరుకానుండడం కలకలం రేపుతుంది. ఆనాడు టీఎల్ ఎం మెటీరియల్ కొరకు 27 కేజీబీవీల నుంచి 33 లక్షలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పనంగా కేటాయింపులు జరిపారన్న ఆరోపణలు నేపథ్యంలో విచారణ జరుగనుంది. 2.5 లక్షల కొనుగోళ్లకే టెండర్ల ద్వారా జరిపే అధికారులు 30 లక్షల పైచిలుకు సొత్తును ఒక్కొక్క కేజీబీవీ నుంచి ప్రత్యేకంగా కొనుగోలు చేశామని సాకుతో మెటీరియల్ రాకుండానే ఏజెన్సీ ఖాతాకు నగదు బదులాయించిన వ్యవహరంపై విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి జరుగుతున్న విచారణ అధికారులు ఎస్పీడీ కార్యాలయంకు హాజరుతో ముగింపు పలుకుతుందా లేదా అన్న చర్చ జరుగుతుంది. ఆనాడు జిల్లా అధికారుల ఆదేశాలను ఎస్ వోలు అమలు చేశామని లిఖితపూర్వకంగా రాసిచ్చిన నేపథ్యలో ఆనాడు విధుల్లో అధికారులపై చర్యలు తీసుకుంటారా లేక ఎలాంటి నిర్ణయం ఉంటుందోనన్న చర్చ జరుగుతుంది.
