టీఎల్ఎం వ్యవహారంలో విద్యాశాఖాధికారులకు నోటీసులు

సర్వశిక్షా అభియాన్ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశాలు డిఈవోతో పాటు ఎఫ్ఏవో, ఎస్ వోలకు తాఖీదులు   నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా విద్యాశాకాధికారులను టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) కొనుగోలు వివాదం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కామారెడ్డికి చెందిన ఏజెన్సీకి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ తీసుకోకముందే జమ చేసిన డబ్బుల వ్యవహరంలో విద్యాశాఖాధికారులకు సర్వశిక్షా అభియాన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనూ విద్యాశాఖాధికారులు వివరణ ఇచ్చిన దానిపై అధికారులు సంత`ప్తి చెందలేదు. జిల్లాలోని కేజీబీవీలలోని ఉన్నత తరగతుల...